క్షయవ్యాధి నివారణకు పాటుపడాలి | Prevention of of tuberculosis also wrote | Sakshi
Sakshi News home page

క్షయవ్యాధి నివారణకు పాటుపడాలి

Mar 25 2014 1:17 AM | Updated on Sep 2 2017 5:07 AM

క్షయవ్యాధి నివారణకు పాటుపడాలి

క్షయవ్యాధి నివారణకు పాటుపడాలి

సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ క్షయవ్యాధి నివారణకు పాటుపడాలని కలెక్టర్ టి.చిరంజీవులు పిలుపునిచ్చారు.

 నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్,సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్క రూ  క్షయవ్యాధి నివారణకు పాటుపడాలనికలెక్టర్ టి.చిరంజీవులు పిలుపునిచ్చారు.  ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్ర వైద్యశాలలో  క్షయ నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్ర జల భాగస్వామ్యం, డాక్టర్ల అంకితభావంతో పనిచేస్తే క్షయవ్యాధిని సంపూర్ణ ంగా నిర్మూలించవచ్చునన్నారు. మసూ చీ, ప్లేగు, పోలియో వ్యాధులను శాశ్వతంగా నిర్మూలించగలిగామన్నారు.

కానీ ప్రజలను చైతన్యపరచని కారణంగా మలేరియా, పైలేరియా, క్షయ వ్యాధుల ను  నిర్మూలించలేకపోతున్నామని విచా రం వ్యక్తం చేశారు. పౌష్టికాహార లోపం, అవగాహన రాహిత్యం కారణంగా క్షయవ్యాధి పెరిగిపోతుందన్నారు. కొన్ని రకా ల వృత్తులు కూడా క్షయ, ఇతర అంటురోగాలకు కారణమవుతున్నాయని చె ప్పారు. సిగరేట్, గుట్కా, పొగాకు ఇత ర వ్యసనాలు విడిచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు.  గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆర్‌ఎంపీలు నిజ మైన వైద్య సేవలు అందించాలన్నారు. సేవాభావంతో పనిచేసే ఆర్‌ఎంపీలకు  సంపూర్ణ సహకారం అందిస్తామని  చెప్పారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.ఆమోస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే చైనా తర్వాత ఇండియా క్షయవ్యాధిలో 2వ స్థానంలో ఉందన్నారు. జిల్లాలో ఇప్పటికే గుర్తించిన 4 వేల మంది రోగులకు వైద్య సౌకర్యం అంది స్తున్నట్లు తెలిపారు. అనంతరం క్షయవ్యాధి నియంత్రణకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ మెమోంటో, ప్రశంసపత్రాలు అందజేశారు.  కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ అరుంధతి, డీఐఓ డాక్టర్ ఎబీనరేంద్ర, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ విజయ్‌కుమార్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ హరినాథ్, డాక్టర్ గౌరి శ్రీ, డెమో తిరుపతయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement