
రాష్ట్రపతి ‘శీతాకాల విడిది’ రద్దు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది రద్దయింది. ఈ నెల 24 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో శీతాకాల విడిదికి రావాల్సిన రాష్ట్రపతి తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది రద్దయింది. ఈ నెల 24 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో శీతాకాల విడిదికి రావాల్సిన రాష్ట్రపతి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. గుండె సంబంధిత ఇబ్బందులతో ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన రద్దయినట్లు విశ్వసనీయ సమాచారం.
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిదికి వచ్చిన సమయంలో ఇక్కడి నుంచే ఆయన దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరై తిరిగి హైదరాబాద్ వస్తుండేవారు. ఈసారి పర్యటనలో తిరుపతితోపాటు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది. ఇక్కడికి వస్తే.. రాజకీయ ప్రముఖులు, సామాజిక సంఘాలు, ఎన్జీవోలు, ప్రజలు ఎప్పటికప్పుడు ఆయనను కలవడానికి వస్తుంటారని దీనివల్ల విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండదని భావించినట్లు సమాచారం.