breaking news
winter vacation
-
ఈ వింటర్ వెకేషన్‌కు అంతా అక్కడికే!
దేశీయంగా పర్యాటకుల్లో దాదాపు 55 శాతం మంది ఏటా శీతాకాలంలో విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ట్రావెల్ సీజన్లో గోవా, కేరళ ప్రధాన గమ్యస్థానాలుగా ఉంటున్నాయి. సెలవ రోజులు గడిపేందుకే కాకుండా కాస్త రిలాక్స్ అయ్యేందుకు కూడా శీతాకాలం ట్రిప్‌లను భారతీయులు ఎంచుకుంటున్నారు. టెక్ హాస్పిటాలిటీ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.‘ఎయిర్‌బీఎన్‌బీ అంతర్గత డేటా ప్రకారం ఈ శీతాకాలం సీజన్లో గోవా, కేరళ, రాజస్థాన్, హిమాలయ ప్రాంత రాష్ట్రాలపై ట్రావెలర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. బీచ్‌లు, బ్యాక్వాటర్లు, సంస్కృతి, శీతాకాలపు వాతావరణం, ఔట్‌డోర్ అనుభూతులు మొదలైన అంశాలు ఇందుకు సానుకూలంగా ఉంటున్నాయి‘ అని ఎయిర్‌బీఎన్‌బీ కంట్రీ హెడ్ అమన్‌ప్రీత్ బజాజ్ తెలిపారు.సానుకూల చల్లని వాతావరణం, ఆకర్షణీయమైన ప్రాంతాల దన్నుతో ప్రస్తుతం ఫేవరెట్ ట్రావెల్ సీజన్లలో శీతాకాలం కూడా చేరిందని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను ఎయిర్‌బీఎన్‌బీ రూపొందించింది. 2,155 మంది పర్యాటకులు ఇందులో పాల్గొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు..లక్షద్వీప్‌లోని అగట్టి, గౌహతితో పాటు పంజాబ్‌లోని చిన్న నగరాలు, కేరళలో పెద్దగా తెలియని తీర ప్రాంత, బ్యాక్‌వాటర్స్ పట్టణాలపై ఆసక్తి వ్యక్తమవుతోంది.యువ ట్రావెలర్లు .. వారణాసి, బృందావన్‌లాంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో పర్యటిస్తున్నారు.శీతాకాలంలో పర్యటించే వారిలో దాదాపు సగం మంది జెనరేషన్ జెడ్, మిలీనియల్స్ వారే ఉంటున్నారు. చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన, అందమైన లొకేషన్స్‌ను ఆస్వాదించేందుకు శీతాకాలంలో ప్రయాణాలను ఎంచుకుంటున్నారు.సీజనల్ సెలవలను గడిపేందుకు శీతాకాలంలో ప్రయాణిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో సుమారు 30 శాతం మంది తెలిపారు. సేద తీరేందుకు ట్రావెల్ చేస్తున్నట్లు 30 శాతం మంది, సరికొత్త సంస్కృతుల గురించి తెలుసుకునేందుకు ఈ సీజన్‌ను ఎంచుకుంటున్నట్లు 20 శాతం మంది వివరించారు.పర్యటనల విషయంలో ఎక్కువ శాతం మంది తమకు అత్యంత సన్నిహితులతోనే కలిసి వెళ్లడానికి ప్రాధాన్యమిస్తున్నారు. 50 శాతం మంది తమ జీవిత భాగస్వామితో కలిసి వెళ్తుండగా, మూడో వంతు మంది.. స్నేహితులతో కలిసి వెళ్తున్నారు. రెండు మూడు తరాల కుటుంబ సభ్యులతో కలిసి తాము ట్రిప్‌లను ప్లాన్ చేస్తామని 30 శాతం మంది వివరించారు. గోవా బీచ్‌లు, కేరళ బ్యాక్‌వాటర్స్ నుంచి మనాలీ, ముస్సోరీలో పర్వత ప్రాంతాలు, సాంస్కృతిక వారసత్వ సంపద కేంద్రాలుగా ఉండే ఉదయ్‌పూర్, జైపూర్‌లాంటి నగరాల వరకు దేశీయంగా కొత్త ప్రాంతాల్లో పర్యటించడంపై, వాటి గురించి తెలుసుకోవడంపై ఆసక్తి పెరుగుతోంది. -
సుప్రీంకోర్టుకు శీతాకాల సెలవులు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు డిసెంబర్ 17 నుంచి వచ్చే జనవరి ఒకటో తేదీ దాకా శీతాకాల సెలవులని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనాలేవీ పనిచేయవని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టుకు రోజుల తరబడి సెలవులు న్యాయార్థులకు ఏమాత్రం సౌకర్యవంతంగా లేదని ప్రజలు భావిస్తున్నారంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు గురువారం రాజ్యసభలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో సీజేఐ తాజా నిర్ణయం వెలువరించడం గమనార్హం. ఇదీ చదవండి: వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకే... మేమున్నది: సుప్రీంకోర్టు -
దక్షిణాది విడిది... ప్రకృతినిధి
సాక్షి , హైదరాబాద్: నగరంలోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయం ప్రకృతికి ఆలవాలం. పచ్చని పరిసరాలు, ఔషధ, పూల మొక్కలతో స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరారు తోంది ఈ నిలయం. 158 వసంతాలు పూర్తి చేసు కున్న ఈ భవన నిర్మాణం, దాని చుట్టూ అల్లుకున్న చరిత్ర అపురూపం. శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిదికి హైదరాబాద్ రానున్న దృష్ట్యా ఈ నిలయం విశేషాలపై ‘సాక్షి’ కథనం... తండ్రి శంకుస్థాపన.. కొడుకు చేతులు మీదుగా ప్రారంభం ఆసిఫ్‌జాహీ వంశీయుల నాలుగో పాలకుడు నిజాం నజీర్–ఉద్–దౌలా ఈ భవన నిర్మాణానికి 1856లో శంకుస్థాపన చేశారు. అయితే ఇతను 1857లో మరణించారు. ఇతడి కుమారుడు ఐదవ నిజాం అఫ్జల్–ఉద్–దౌలా తండ్రి ప్రారంభించిన భవనాన్ని 1860లో పూర్తి చేయించాడు. ఇలా 158 ఏళ్లకు పూర్వం నిజాం పాలకులు కట్టించిన భవనం ఇది. దీన్ని ఐదవ నిజాం నవాబులు తమ విశ్రాంతి భవనంగా వాడుకున్నారు. ఈ ప్యాలెస్ చుట్టూ 50 అడుగుల ప్రహరీ నిర్మించారు. వీటితోపాటు కంద కాలు తవ్వించారు. ఎంతదూరంలో ఉన్న శత్రువు నైనా గుర్తించడానికి వీలుగా నిర్మాణాలు చేపట్టారు. దేశంలో మొత్తం 3 చోట్ల: రాష్ట్రపతికి దేశం మొత్తం మీద 3 భవనాలు ఉన్నాయి. ఒకటి దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్. ఆయన ఉత్తరాదికే పరిమితం కాకుండా మిగతా రాష్ట్రాల్లో పరిస్థితులు, అక్కడున్న ప్రజల సాధదక బాధకాలు తెలుసుకునేం దుకు వీలుగా ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి, దక్షిణాది రాష్ట్రాల్లో ఒక విడిది భవనాన్ని ఏర్పాటు చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో ఒకటి, దక్షిణాది వారికోసం బొల్లారం విడిది గృహం ఏర్పడింది. ఏటా శీతాకాలంలో రాష్ట్రపతి ఇక్కడికి వస్తారు. వారం నుంచి 2 వారాలు ఉంటారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేసవిలో సిమ్లాలో ఉంటారు. 25 వేల చదరపు గజాల్లోనే భవనం 98 ఎకరాల విస్తీర్ణంతో ఉండే రాష్ట్రపతి నిలయంలో మధ్యలో రాష్ట్రపతి భవనం, చుట్టూ పచ్చని తోట లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మొత్తం వైశాల్యం లో 25 వేల చ.అడుగుల విస్తీర్ణంలోనేభవనం ఉంది. మిగతా స్థలంలో రకరకాల ఔషధ మొక్కలు, పూల తోటలు ఉన్నాయి. ఇవి సుమారుగా 7,000 చ.మీ. విస్తీర్ణంలో ఉన్నాయి. వాటిలో సర్పగంధ, కాల బంధ, సిట్రొన్నా, నిమ్మ గడ్డి, ఖుస్, జెరానియం, కొత్తిమీర, గంధపు చెట్టు, గడ్డ దినుసు, జాస్మిన్, కల్మేఘ్, తులసి మొదలైనవి. ఈ తోటను తెలంగాణ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ నిర్మించింది. ఈ భవనం మూడు భాగాల్లో ఉంది ప్రెసిడెంట్ వింగ్, ఫ్యామిలీ వింగ్ లేదా సెంట్రల్ వింగ్ , ఏడీసీ వింగ్. ఈ 3 విభాగాల్లో కలిసి మొత్తం 20 గదులున్నాయి. వేర్వేరుగా ఉన్నా వీటిని కలుపు తూ అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉంది. ఈ 3 వింగ్‌లకు వేరుగా వంటశాలలు ఉన్నాయి. ఈ అండర్ గ్రౌండ్ టన్నెల్ ఒక వంటశాల దగ్గర మొదలై ఇంకో వింగ్‌లో ఉన్న డైనింగ్ హాల్ దగ్గర ఆగుతుంది. ఈ సొరంగంలోకి బాగా వెలుతురు వచ్చే విధంగా భూమి వైపు కిటికీలు అమర్చారు. బయటి నుంచి చూస్తే అండర్‌గ్రౌండ్ కనబడుతుంది.బ్రిటిష్ వారి అధీనంలోకి వచ్చాక ఈ మార్గాన్ని నిర్మించారు. అతిథులకు అన్ని సౌకర్యాలు: రాష్ట్రపతితో పాటు, ఆయన కుటుంబీకులు ఉండేందుకు. భద్రతా సిబ్బంది. ప్రెసిడెంట్ వింగ్‌లో సినిమా హాల్ దర్బార్ హాల్, 25 మంది ఒకేసారి భోజనం చేసేలా భోజనశాల, అతిథి గదులు ఇలా అన్ని వసతులు ఉన్నాయి. భవన నిర్మాణమంతా యూరోపియన్ శైలిలో ఉంటుంది. బ్రిటిష్ సైన్యం నుంచి... మన రాష్ట్రపతి నిలయంగా.. 1803లో ఆసిఫ్ జాహీ వంశీయుల మూడో పాలకుడి పట్టాభిషేకం చేశారు. అనంతరం 1806లో ప్రస్తుతం ఉన్న కంటోన్మెంట్ ఏరియాలో బ్రిటిష్ వారు తమ సైన్యం బస చేయడానికి అనుమతులు పొందారు. బొల్లారంలో బ్రిటిష్ సైనికులకు క్వార్టర్లు కట్టించారు. దానికి దగ్గరలో ఉన్న ఈ భవనంపై బ్రిటిష్ వాళ్ల కన్ను పడింది. అలా బ్రిటిష్ సైన్యాధికారి కార్యాలయంగా మారింది. దీంతో ఇది బ్రిటిష్ రెసిడెన్సీగా మారింది. ఈ భవన స్థలంలో సైనికులకు శిక్షణ కూడా ఇచ్చేవారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక 1950లో ఈ భవనాన్ని కేంద్ర ప్రభుత్వం రూ. 60 లక్షలకు ఖరీదు చేసింది. మరమ్మతులు చేయించి రాష్ట్రపతికి శీతాకాల విడిదిగా మార్చారు. తొలిసారిగా అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ 1953 జనవరి నెలలో ఈ భవనంలో బస చేశారు. ఈ నిలయంలో ఒక దేవాలయం కూడా ఉంది. -
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి..
-
ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది
-
రాష్ట్రపతి ‘శీతాకాల విడిది’ రద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది రద్దయింది. ఈ నెల 24 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో శీతాకాల విడిదికి రావాల్సిన రాష్ట్రపతి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. గుండె సంబంధిత ఇబ్బందులతో ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన రద్దయినట్లు విశ్వసనీయ సమాచారం. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిదికి వచ్చిన సమయంలో ఇక్కడి నుంచే ఆయన దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరై తిరిగి హైదరాబాద్ వస్తుండేవారు. ఈసారి పర్యటనలో తిరుపతితోపాటు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది. ఇక్కడికి వస్తే.. రాజకీయ ప్రముఖులు, సామాజిక సంఘాలు, ఎన్జీవోలు, ప్రజలు ఎప్పటికప్పుడు ఆయనను కలవడానికి వస్తుంటారని దీనివల్ల విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండదని భావించినట్లు సమాచారం.


