ఉస్మానియా ఆసుపత్రిలో అంధకా రం అలుముకుంది. సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు...
అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: ఉస్మానియా ఆసుపత్రిలో అంధకా రం అలుముకుంది. సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు విద్యుత్ నిలిచిపోవడంతో రోగులు, సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రిలోని క్యాజువాల్టీ, ఏబీసీ, ఏఎంసీ, ఏఎన్‌ఎస్‌సీ, మీకో వార్డుల్లో శస్త్రచికిత్సలకు అంతరాయం కలిగింది.
పలు శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. ఓపీ రిజిస్ట్రేషన్ విభాగం, ఎంక్వైరీ విభాగాల్లో కంప్యూటర్లు పనిచేయక రోగుల వివరాల నమోదుకు సిబ్బంది అవస్థలు పడ్డారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లో వచ్చిన రోగులకు సత్వరం వైద్యం అందించాల్సి ఉండగా, విద్యుత్ లేకపోవడం తో ఇతర ఆస్పత్రుల కు పంపించాల్సిన దుస్థితి నెలకొంది. ఓపీ భవనంలో జనరేటర్ ఉన్నా.. పనిచేయలేదు. డ్యూటీ ఆర్‌ఎంవో డాక్టర్ రఫీ మీడియాకు వివరణనిస్తూ.. సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ అంతరాయం తలెత్తిందన్నారు.