త్వరలో పోస్టల్ కోర్ బ్యాంకింగ్ సేవలు | Postal core banking services in soon | Sakshi
Sakshi News home page

త్వరలో పోస్టల్ కోర్ బ్యాంకింగ్ సేవలు

May 28 2014 1:22 AM | Updated on Sep 18 2018 8:18 PM

జిల్లా కేంద్రంతో పాటు మంచిర్యాలలో పోస్టల్ కోర్ బ్యాంకింగ్ సర్వీసులు త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర డీపీఎస్ (డెరైక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్) విశాలాక్షి పేర్కొన్నారు.

ఎదులాపురం, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంతో పాటు మంచిర్యాలలో పోస్టల్ కోర్ బ్యాంకింగ్ స ర్వీసులు త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర డీపీఎస్ (డెరైక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్) విశాలాక్షి పేర్కొన్నారు. మంగళవారం ఆదిలాబాద్ హెడ్ పోస్టాఫీస్‌ను ఆమె సందర్శించారు. కోర్ బ్యాం కింగ్  సర్వీసులు అమలు చేసేందుకు అనువైన పరిస్థితుల పరిశీలనకు హెడ్ పోస్టాఫీస్‌ను సందర్శించినట్లు డీపీఎస్ తెలిపారు. బ్యాంకింగ్ సేవ ల రూపంలో ప్రతీ హెడ్ పోస్టాఫీస్ పరిధిలో ఏ టీఎం సౌకర్యాలు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.

ప్రతీ హెడ్ పోస్టాఫీస్‌లోని సే వింగ్స్ బ్యాంక్ ఖాతాల వివరాలను వినియోగదారులు పరిశీలించుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ హెడ్ పోస్టాఫీస్ పరిధిలో 9,206 ఖా తాలున్నాయని, వినియోగదారులు ఎంత త్వర గా స్పందించి ఖాతాల వెరిఫికేషన్ చేసుకుంటే అంత త్వరగా కోర్ బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చే వీలుంటుందని తెలిపా రు. కార్యాలయంలోని వివిధ సేవల పనితీరు గురించి జిల్లా పోస్టల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డీపీఎస్ వెంట జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ పండరి, అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ సంతోష్, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement