ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి | Pongalati Sudhakar Reddy Fire on CM KCR | Sakshi
Sakshi News home page

ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

Apr 29 2017 2:18 AM | Updated on Sep 17 2018 8:11 PM

ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి - Sakshi

ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

వరంగల్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ సభలో కాంగ్రెస్‌పార్టీ నేతలను ఉద్దేశించి దద్దమ్మలు, సన్నాసులు అని సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ను డిమాండ్‌ చేసిన పొంగులేటి
సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ సభలో కాంగ్రెస్‌పార్టీ నేతలను ఉద్దేశించి దద్దమ్మలు, సన్నాసులు అని సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ కేసీఆర్‌ తన వ్యాఖ్యలను ఉపసం హరించుకోకుంటే భూసేకరణ బిల్లుపై జరుపుతున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని బహిష్కరించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోయడానికే సభ పెట్టినట్టుగా ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement