కల్తీ కల్లు తయారీ కేంద్రంపై దాడులు | Police raid adulterated toddy center | Sakshi
Sakshi News home page

కల్తీ కల్లు తయారీ కేంద్రంపై దాడులు

Jan 22 2016 6:53 PM | Updated on Aug 17 2018 5:07 PM

బంజారాహిల్స్ రోడ్ నెం.11లోని ఉదయ్‌నగర్‌లో కల్తీ కల్లు తయారీ కేంద్రంపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించి 40 లీటర్ల కల్తీ కల్లును స్వాధీనం చేసుకుని నిందితురాలు వెంకటమ్మను అరెస్టు చేశారు.

హైదరాబాద్‌ : బంజారాహిల్స్ రోడ్ నెం.11లోని ఉదయ్‌నగర్‌లో కల్తీ కల్లు తయారీ కేంద్రంపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించి 40 లీటర్ల కల్తీ కల్లును స్వాధీనం చేసుకుని నిందితురాలు వెంకటమ్మను అరెస్టు చేశారు. తడి చెత్త, పొడిచెత్త వేర్వేరుగా భద్రపరిచేందుకు ఇటీవలే జీహెచ్‌ఎంసీ అధికారులు ఇంటింటికి రెండు డబ్బాలను ఉచితంగా అందజేశారు. వెంకటమ్మ కల్తీ కల్లు తయారుచేస్తూ ఇవే డబ్బాల్లో నింపి అధికారులకు పట్టుబడింది. కొంత కాలం నుంచి బస్తీలో కల్తీ కల్లు విక్రయం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement