హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ (పీసీ నెంబర్ 1054) మంగళవారం మధ్యాహ్నం గుండెనొప్పితో మరణించాడు.
హసన్‌పర్తి (వరంగల్ జిల్లా) : హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ (పీసీ నెంబర్ 1054) మంగళవారం మధ్యాహ్నం గుండెనొప్పితో మరణించాడు. విధినిర్వహణలో ఉన్న శ్రీనివాస్ ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన తోటి పోలీసులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. శ్రీనివాస్ 1993 బ్యాచ్‌కు చెందినవాడు.