ప్రభుత్వం పారిపోతుందా..? | Pocharam Srinivas Reddy comments on Farmers loan waiver | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం పారిపోతుందా..?

Jun 30 2017 12:39 AM | Updated on Oct 17 2018 6:06 PM

ప్రభుత్వం ఏమైనా పారిపోతుందా..? రైతుల రుణ మాఫీ సొమ్ము రూ.16,500 కోట్లు పువ్వుల్లో పెట్టి బ్యాంకులకు జమ చేశాం.

వడ్డీ డబ్బులు వసూలు చేస్తున్నారని బ్యాంకర్లపై పోచారం ఆగ్రహం
సాక్షి, నిజామాబాద్‌: ‘‘ప్రభుత్వం ఏమైనా పారిపోతుందా..? రైతుల రుణ మాఫీ సొమ్ము రూ.16,500 కోట్లు పువ్వుల్లో పెట్టి బ్యాంకులకు జమ చేశాం. తల తాకట్టు పెట్టయినా సరే బకాయిల డబ్బులు కూడా బ్యాంకులకు జమ చేశాం.. అయినా బ్యాంకర్లు రైతుల వద్ద వడ్డీ మాఫీ డబ్బులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. రూ.16 వేల కోట్లు చెల్లించిన ప్రభుత్వం రూ.200 కోట్లు వడ్డీ మాఫీ డబ్బులు చెల్లించదా?’’అని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బ్యాంకర్లపై మండిపడ్డారు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో గురువారం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు.   త్వరలో రాష్ట్రంలో క్రాప్‌ కాలనీలు ఏర్పాటు చేస్తామని, స్థానిక వినియోగానికి తగ్గట్టుగా ఉత్పత్తి జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం సీఎఫ్‌టీఆర్‌ఐ (సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌) సహకారం తీసుకుంటున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement