చూపున్న కాళ్లు.. నడకనేర్పుతున్న కళ్లు ! | Physically challenged Wife, Blind Husband Begging In Suryapet | Sakshi
Sakshi News home page

చూపున్న కాళ్లు.. నడకనేర్పుతున్న కళ్లు !

Jun 25 2018 8:00 PM | Updated on Jul 27 2018 2:26 PM

Physically challenged Wife, Blind Husband Begging In Suryapet - Sakshi

 ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తున్న శోభ–సత్తయ్య దంపతులు 

సూర్యాపేట : నడవ లేని ఆమె కాళ్లు చూపులేని ఆయనను నడిపిస్తున్నాయి... అలాగే చూపులేని ఆయన కళ్లు ఆమెకు దారిచూపుతున్నాయి. ఇదేమి విచిత్రం అనుకుంటున్నారా.. అవును ఇది నిజం.. కాళ్లు లేని ఓ మహిళ మూడు చక్రాల రిక్షాపై కూర్చొని కళ్లు లేని తన భర్తసాయంతో ఆ రిక్షాను నడిపిస్తూ బతుకుబండిని లా గిస్తోంది.

సూర్యాపేట పట్టణానికి చెందిన శోభ– సత్తయ్య దంపతులకు ఎవరూ లేకపోవడంతో  పొట్ట కూటికోసం స్థానిక పాత శివాలయం వద్ద ఇలా యా చిస్తూ సాక్షి కెమెరాకు చిక్కారు. అయితే సత్తయ్యకు రెండు కళ్లు కన్పించవు.. శోభకు కాళ్లు కదలలేని పరిస్థితి.

కాగా వీరి ప్రయాణం మాత్రం భర్త మూడు చక్రాల బండిని తోసుకుపోతుండగా.. భార్య దారి చూపుతోంది. వీరిని చూసేవారు అయ్యో పాపం అనుకుంటున్నప్పటికీ ఈ వృద్ధ దంపతుల అనోన్యతను చూసి ఆశ్చర్యపోతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement