పర్మిట్ రూమ్‌లో వ్యక్తి మృతదేహం | Permit the body of the person in the room | Sakshi
Sakshi News home page

పర్మిట్ రూమ్‌లో వ్యక్తి మృతదేహం

Jun 28 2015 1:50 AM | Updated on Sep 3 2017 4:28 AM

సదాశివనగర్ మండల కేంద్రంలో గల సెవెన్ హిల్స్ వైన్స్ పక్కన ఉన్న పర్మిట్ రూమ్‌లో ఓ వ్యక్తి శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

సదాశివనగర్:సదాశివనగర్ మండల కేంద్రంలో గల సెవెన్ హిల్స్ వైన్స్ పక్కన ఉన్న పర్మిట్ రూమ్‌లో ఓ వ్యక్తి శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మండలంలోని పద్మాజీవాడి గ్రామానికి చెందిన మడిపెద్ది నారాయణ(52) అనే వ్యక్తి వైన్స్ పక్కన ఉన్న పర్మిట్ రూమ్‌కు మద్యం సేవించడానికి వచ్చాడు. మద్యం సేవించిన అనంతరం ఎవరో వ్యక్తులు తలపై కొట్టడంతోనే అక్కడిక్కడే మృతి చెందాడని మృతుడి బంధువులు ఆందోళన చేశారు. పర్మిట్ రూమ్‌లో వ్యక్తి మృతి చెందినట్లు తెలిసి న వైన్స్ దుకాణాన్ని ఎలా నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తు దుకాణాన్ని మూసివేశారు. పర్మిట్ రూమ్‌లో ఘర్షణ జరగడంతోనే మృతి చెందాడని ఆరోపించారు. ఘటనా స్థలాన్ని ఎస్సై ప్రతా ప్ లింగం పరిశీలించారు. ఆందోళన చేస్తున్న మృతుడి బంధువులను సముదాయించారు. అయినా వారు  వైన్స్ నిర్వాహకులు వచ్చే వరకు శవాన్ని తీసే ది లేదని బీష్మించారు. ఈ విషయమై ఎస్సైని వివరణ కోరగా తలకు గాయమైన మాట వాస్తవమేపపి, వ్యక్తి మ ద్యం సేవించి కింద పడి చనిపోయాడా? ఏమైన ఘర్షణ జరిగిందా? అనే విషయాలను పోస్టుమార్టం నివేదిక ఆధారంగా వెలుగు చూస్తాయని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement