జూలై 25న జర్నలిస్టులకు పాస్‌పోర్టు మేళా | Passport Mela for Journalists | Sakshi
Sakshi News home page

జూలై 25న జర్నలిస్టులకు పాస్‌పోర్టు మేళా

Jul 17 2015 8:26 PM | Updated on Sep 4 2018 5:16 PM

ఈ నెల(జూలై) 25వ తేదీన జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యుల కోసం ప్రత్యేకంగా పాస్‌పోర్టు మేళా నిర్వహించనున్నట్లు రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్వినీ సత్తారు వెల్లడించారు.

హైదరాబాద్ : ఈ నెల(జూలై) 25వ తేదీన జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యుల కోసం ప్రత్యేకంగా పాస్‌పోర్టు మేళా నిర్వహించనున్నట్లు రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్వినీ సత్తారు వెల్లడించారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్, రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రామాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్ కోశాధికారి పీవీ శ్రీనివాసరావు, కార్యదర్శి రాజమౌళిచారితో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

అయితే ఈనెల 22 నుంచి 24 వరకు జర్నలిస్టులందరూ ప్రెస్‌క్లబ్‌లో రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. అందుకు తమ కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు అందుబాటులో ఉంటారన్నారు. ఫైల్ ప్రాసెస్ ఏవిధంగా చేయాలో వారు సూచిస్తారన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే 25న నిర్వహించే పాస్‌పోర్టు మేళాకు అనుమతి ఉంటుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement