‘పంచాయతీ’పై రాద్ధాంతం ఎందుకు?: కరుణాకర్‌రెడ్డి 

On Panchayat Reservations Political parties are not doing it - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేయడం తగదని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 22.79 శాతానికి పరిమితం చేయడాన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. ఆదివారం ఇక్కడ ఆదర్శనగర్‌లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నిరకాల రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానాన్ని గౌరవించకుండా ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడటం తగదన్నారు.   పంచాయతీ ఎన్నికల్లో తమిళనాడులో కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రం రిజర్వేషన్లున్నాయని, బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్లు లేవని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓసీలకు అన్యాయం జరగకుండా ఓసీలు అత్యధిక జనాభా ఉన్న గ్రామాలను ఇతర వర్గాలకు కేటాయించకుండా జనరల్‌ స్థానాలుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘం నాయకులు రాజశేఖర్‌రెడ్డి, విశ్వేశ్వర్, ప్రవీణ్‌ కుమార్, విజయానంద్‌ పాల్గొన్నారు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top