మన గుండెల్లో బతికే ఉంటారు | Our hearts are still alive | Sakshi
Sakshi News home page

మన గుండెల్లో బతికే ఉంటారు

Aug 27 2015 2:01 AM | Updated on Sep 3 2017 8:10 AM

మండలంలోని మల్లికుదుర్ల గ్రామానికి చెందిన మర్రి లక్ష్మి కుటుంబ సభ్యులను షర్మిల బుధవారం

మల్లికుదుర్ల(ధర్మసాగర్): మండలంలోని మల్లికుదుర్ల గ్రామానికి చెందిన మర్రి లక్ష్మి కుటుంబ సభ్యులను షర్మిల బుధవారం పరామర్శించారు. దాదాపు 45 నిమిషాలు మాట్లాడారు. ‘రాజన్న చనిపోరుున విషయం గురించి రోజూ పేపర్‌లో వచ్చిన వార్తలు చదివించుకునేది. టీవీల వార్తలు చూసేది. ఇట్లనే గుండెపోటుతో చనిపోరుుంది’ అని లక్ష్మి మృతిని కుటుంబ సభ్యులు వివరించారు. ‘వారికి మరణం లేదు. మన గుండెల్లో బతికే ఉంటారు. ధైర్యం చెదరనీయొద్దు.

మంచి రోజులు ముందున్నారుు’ అని షర్మిల ధైర్యం చెప్పారు. కుటుంబం బాగోగులు కనుక్కున్నారు. ‘ఎంబీఏ ఫైనాన్స్‌కు మంచి భవిష్యత్ ఉంది. కష్టపడి చదు వు. ఉద్యోగం కోసం సాయం కావాలంటే నన్ను సంప్రదించు’ అని లక్ష్మి కుమారుడికి సూచించారు. ‘ఎలాంటి కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి’ అని కుటుంబ సభ్యులతో చెప్పారు. ‘మీరు రావడంతో మా కుటుంబానికి ఎంతో ధైర్యం వచ్చింది’ అని మర్రి ఐలయ్య అన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement