హైకోర్టులో వృద్ధురాలి విజయం     

Old Lady success in the High Court - Sakshi

చనిపోయిన భర్త పేరిటఉన్న భూమికోసం దరఖాస్తు.. 

2016 నుంచి వాయిదా వేసుకుంటూ వచ్చిన అధికారులు

హై కోర్టును ఆశ్రయించిన వృద్ధురాలు

ఎనిమిది వారాల్లో పట్టాదారు, టైటిల్‌డీడ్‌లు జారీ చేయాలని హైకోర్టు ఆదేశం

సారంగాపూర్‌(జగిత్యాల) : జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలం అర్పపల్లికి చెందిన అంబల్ల గంగవ్వకు ఆమె భర్త పేరిట ఉన్న భూములను విరాసత్‌ చేయాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఉత్తర్వులు అందిన ఎనిమిది వారాల్లోగా పట్టాదారు, టైటిల్‌డీడ్‌లు అందజేయాలని సూచించింది. అంబల్ల గంగవ్వ భర్త ముత్యంరెడ్డి నవంబర్‌ 27, 2002లో మృతి చెందాడు. ముత్యంరెడ్డి పేరిట వివిధ సర్వేనంబర్లలో ఉన్న 15.07 ఎకరాలను తన పేరిట మార్పు చేసి పట్టాదారు, టైటిల్‌డీడ్‌ ఇవ్వాలని మృతుడి భార్య గంగవ్వ అధికారులకు విన్నవించింది.

అధికారుల నుంచి స్పం దన కరువైంది. పలుమార్లు తహసీల్దార్‌ కార్యాల యం చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో 2016లో మరోసారి మీసేవ ద్వారా విరాసత్‌ కు దరఖాస్తు చేసుకుంది. పలు కారణాలు చూపుతూ అధికారులు వాయిదా వేస్తూ వచ్చారు. గంగవ్వ బంధువులు సైతం అడ్డుపడ్డట్లు తెలిసింది. విసిగి వేసారిన గంగవ్వ చివరికి హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ప్రతివాదులుగా రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, సారంగాపూర్‌ తహసీల్దార్లను చేర్చింది.

గంగవ్వ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు పట్టాదారు, టైటిల్‌డీడ్‌లు ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వులు అందిన ఎనిమిది వారాల్లోగా గంగవ్వ పేరిట ఆమె భర్త భూములను మార్చా లని ఆదేశించింది. ఈ కేసులో ఎలాంటి రిట్‌పిటిషన్‌కు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని మేజిస్ట్రేట్‌ ఆదేశాల్లో పేర్కొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top