రెన్యువల్ కాని 96 మద్యం షాపులకు 7న నోటిఫికేషన్ | Not renewal for 96 liquor shops to july 7 notification | Sakshi
Sakshi News home page

రెన్యువల్ కాని 96 మద్యం షాపులకు 7న నోటిఫికేషన్

Jul 5 2015 2:13 AM | Updated on Sep 3 2017 4:53 AM

రెన్యువల్ కాని 96 మద్యం షాపులకు 7న నోటిఫికేషన్

రెన్యువల్ కాని 96 మద్యం షాపులకు 7న నోటిఫికేషన్

మద్యం విధానం ఖరారు గాక మూడు నెలల పాటు మద్యం దుకాణాల లెసైన్స్‌ల గడువు పొడిగించినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 96 దుకాణాలు రెన్యువల్ కాలేదు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని 105 దుకాణాలకు సైతం..
సాక్షి, హైదరాబాద్: మద్యం విధానం ఖరారు గాక మూడు నెలల పాటు మద్యం దుకాణాల లెసైన్స్‌ల గడువు పొడిగించినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 96 దుకాణాలు రెన్యువల్ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ దుకాణాల లెసైన్స్‌ల జారీకి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాలకు గాను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 105 దుకాణాలను గతంలో ఎవరూ తీసుకోలేదు.

దీంతో రెన్యువల్ కాని 96 దుకాణాలతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 105 దుకాణాలకు కూడా ఈ నెల 7న నోటిఫికేషన్ జారీ చేయాలని ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. ఈ మేరకు 7వ తేదీన కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేసి 13వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తారు. 14వ తేదీన మద్యం దుకాణాలకు లాటరీ తీసి 16న లెసైన్సులు జారీ చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement