సమీక్ష.. ఇదేమి శిక్ష? | No minimum facilities to anganwadi teachers | Sakshi
Sakshi News home page

సమీక్ష.. ఇదేమి శిక్ష?

Jul 27 2018 1:51 AM | Updated on Jul 27 2018 1:51 AM

No minimum facilities to anganwadi teachers - Sakshi

ఏటూరునాగారం: సమావేశ మందిరంలో కనీస సౌకర్యాలు లేక అంగన్‌వాడీ టీచర్లు నానా అవస్థలు పడ్డారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ఏటూరునాగారం ఐటీడీఏలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం అంగన్‌వాడీ కేంద్రాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు సంగూలాల్‌ పాల్గొన్న ఈ కార్యక్రమానికి మొత్తం ఆరు మండలాల పరిధిలోని 442 కేంద్రాలకు చెందిన అంగన్‌వాడీ టీచర్లు హాజరయ్యారు. వారికి కనీసం కూర్చోవడానికి సదుపాయం కల్పించలేదు. కుర్చీలు లేకపోవడంతో కొందరు సమావేశ మందిరంలోని టేబుళ్ల మధ్యలో కూర్చోగా.. చాలా మంది వరండాలోనే సర్దుకున్నారు. సుమారు రెండు గంటల పాటు నరకం అనుభవించాల్సి వచ్చిందని పలువురు అంగన్‌వాడీ టీచర్లు వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement