పుట్టు పూర్వోత్తరాలు చెప్పాల్సిందే..

new format for ration cards in telangana - Sakshi

కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు 

24 అంశాలతో కొత్త ఫార్మాట్‌ను రూపొందించిన సివిల్‌ సప్లయ్‌ రాష్ట్ర శాఖ 

తహసీల్దార్‌ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ 

ఇక తెల్ల కాగితంపై రాసిచ్చే పద్ధతికి స్వస్తి

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? అయితే మీ పుట్టు పూర్వోత్తరాలు అన్నీ చెప్పాల్సిం దే.. ఇంట్లో గ్యాస్‌ కనెక్షన్‌ ఉందా..? ఉంటే ఏ కంపెనీ..? బ్యాంకు ఖాతా ఉందా..? అయితే ఏ బ్రాంచ్‌..? మీకు వాహనం ఉందా..? ఉంటే బై కా? కారా.? అలాగే భూములున్నాయా..? ఎన్ని ఎకరాలు..? ఇలా ఒకటేంటి చివరి ఇంటికి వచ్చే కరెంట్‌ బిల్లుతో సహా 24 రకాల వివరాలను ఖచ్చితంగా చెప్పి తీరాలి. లేదంటే రేషన్‌ కార్డు రాదు. ఇప్పటినుంచి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే సంబంధిత ఫార్మెట్‌లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం మంజూరు చేసే కొ త్త రేషన్‌ కార్డుల్లో బోగస్‌ లేకుండా అర్హులైన పేదలకే అందించడానికి సివిల్‌ సప్లయ్‌ శాఖ అధికారులు నిబంధనలతో కూడిన మూడు పేజీలు ఉ న్న దరఖాస్తు ఫారాన్ని రూపొందించారు. ఈ కొ త్త ఫార్మాట్‌ను రాష్ట్ర అధికారులు జిల్లా సివిల్‌ స ప్లయ్‌ అధికారులకు పంపించారు. ఇకపై కొత్త గా రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటే ఇదే ఫారం ద్వారానే దరఖాస్తులు చేసు కోవాల్సి ఉంటుందని, అయితే దరఖాస్తులను సంబంధిత మండల తహసీల్దార్‌ కార్యాలయం లో అందజేయాలని అధికారులు వెల్లడించారు. 
 

తెల్ల కాగితానికి స్వస్తి.. 
రేషన్‌ కార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలనుకునే వారు ఇది వరకు మీసేవా కేంద్రాల్లోనో లే దా తహసీల్దార్‌ కార్యాలయాల్లోనో తెల్ల కాగి తంపై దరఖాస్తు చేసుకుని ఆధార్‌ జిరాక్స్‌ పెడి తే పరిపోయేది. కానీ తాజా మార్గదర్శకాల ప్ర కారం ఇకపై తెల్ల కాగితాలపై దరఖాస్తులు చేసుకునే విధానానికి స్వస్తి పలికారు. కొత్తగా రూ పొందించిన మూడు పేజీలు గల దరఖాస్తు ఫా రాన్ని మండల తహసీల్దార్‌ కార్యాలయాల్లో పొందాల్సి ఉంటుంది. ఇందులో పేరు, ఇంటి పేరు, తండ్రి లేదా తల్లి పేరు, పుట్టిన తేదీ, వయసు, వీధి, కాలనీ, కుటుంబ వార్షిక ఆదాయం, గ్యాస్‌ కనెక్షన్, వాహనాల వివరాలు, భూ ములు, అద్దె, సొంత ఇంటి వివరాలతో పాటు అందులో ఉన్న మరిన్ని అంశాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దరఖాస్తుచ చేసుకునే వా రికి ఇంటి పక్కన గల ఎవరైనా సాక్షి సంతకం కూడా పెట్టించాలి. అన్ని వివరాలతో తహసీల్దా ర్‌ కార్యాలయంలో అందజేస్తే వారు విచారణ జరిపి జిల్లా సివిల్‌ సప్లయ్‌ కార్యాలయానికి పం పిస్తారు. జిల్లా కార్యాలయం అధికారులు సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌ కార్యాలయం హైదరాబాద్‌ కు రేషన్‌ కార్డు మంజూరుకై పంపిస్తారు. ఈ ప్రా సెస్‌ అంతా పూర్తయి కార్డు మంజూరు కావాలం టే సుమారు పక్షం రోజుల నుంచి నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. 

పెండింగ్‌ దరఖాస్తులుదారులు కూడా.. 
కొత్త రేషన్‌ కార్డు కోసం జిల్లాలో గత కొన్ని నెలలుగా దరఖాస్తులు చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇలా దాదాపు 6వేల దరఖాస్తులు మంజూరు కాక పెండింగ్‌లోనే ఉన్నాయి. వీరంతా మీ సేవ కేంద్రాలు, తహసీల్దార్‌ కార్యాలయాల ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు. కానీ కొత్త దరఖాస్తు విధానం వచ్చిన నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న పాత దరఖాస్తు దారులు కూ డా కొత్త ఫార్మాట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. కాని సాధారణ ప్రజలకు ఈ పద్ధతి ఎంతవరకు అర్థమవుతుందో చూడాలి.

కొత్త విధానంలో దరఖాస్తు చేసుకోవాలి 
రాష్ట్ర శాఖ అధికారులు రూపొందించిన దరఖా స్తు ఫారం ద్వారానే కొత్త రేషన్‌ కార్డుల కోసం ద రఖాస్తులు చేసుకోవాలి. తెల్ల కాగితాలపై రాసి ఇస్తే చెల్లదు. అందులో అడిగిన వివరాలతో త హశీల్ధా కార్యాలయాల్లో అందజేయాలి. కొత్త ద రఖాస్తు ఫారాలను తహసీల్దార్‌ కార్యాలయాల కు పంపిస్తున్నాం.        

– కృష్ణప్రసాద్, డీఎస్‌వో  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top