ప్రధాని మోదీ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్రకు పాల్పడుతున్నారని వ్యవయసాయ కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు నాగేంద్రనాథ్ ఓజా విమర్శించారు.
'ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్ర'
Mar 11 2016 3:13 PM | Updated on Sep 5 2018 8:24 PM
యాదగిరిగుట్ట: ప్రధాని మోదీ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్రకు పాల్పడుతున్నారని వ్యవయసాయ కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు నాగేంద్రనాథ్ ఓజా విమర్శించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని, దినసరి కూలీగా రూ.300 చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల దగ్గర భూములను సేకరించి కార్పొరేట్ శక్తులకు అమ్ముకునే కుట్రకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు.
Advertisement
Advertisement