ఎమ్మెల్యే చెప్పులు చోరీ? | nagarkurnool MLA marri janardhan reddy slippers robbery? | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే చెప్పులు చోరీ?

Jan 9 2016 9:30 AM | Updated on Sep 3 2017 3:23 PM

గుడి వద్ద ఓ ఎమ్మెల్యే చెప్పులు చోరీకి గురైనట్టు తెలిసింది.

హైదరాబాద్: గుడి వద్ద ఓ ఎమ్మెల్యే చెప్పులు చోరీకి గురైనట్టు తెలిసింది. గడ్డి అన్నారం డివిజన్ టీఆర్ఎస్ సమావేశానికి వచ్చిన మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయానికి వచ్చారు. దర్శనం అనంతరం బయటకు వచ్చి చూసే సరికి ఎమ్మెల్యే చెప్పులు కనిపించలేదని తెలిసింది.
 
దీంతో ఆలయంలోని సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా ఓ యువకుడు పాదరక్షలు తీసుకెళ్లినట్టు సమాచారం. చోరీకి గురైన పాదరక్షల విలువ సుమారు రూ. 50 వేలు ఉండవచ్చని తెలిసింది. ఈ విషయాన్ని స్థానికి టీఆర్ఎస్ నాయకుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.  అయితే దీనికి సంబంధించి లిఖిత పూర్వకంగా ఎటువంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement