పార్కులో యువకుడి హత్య | Murder of the young man in the park | Sakshi
Sakshi News home page

పార్కులో యువకుడి హత్య

Jul 13 2015 2:16 AM | Updated on Jul 30 2018 8:29 PM

పార్కులో యువకుడి హత్య - Sakshi

పార్కులో యువకుడి హత్య

పార్కులో నిద్రపోతున్న ఓ యువకుడిని దుండగులు బండరాయితో తలపై మోది హత్య చేశారు...

- నిద్రిస్తుండగా బండరాయితో
- మోది చంపిన దుండగులు
బన్సీలాల్‌పేట్:
పార్కులో నిద్రపోతున్న ఓ యువకుడిని దుండగులు బండరాయితో తలపై మోది హత్య చేశారు.  సికింద్రాబాద్ బైబిల్‌హౌస్ పక్కన ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కు లో ఆదివారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. గాంధీనగర్ ఇన్‌స్పెక్టర్ ఆరేటి సంజీవరావు కథనం ప్రకారం.. బైబిల్‌హౌస్ పక్కన ఉన్న పార్కులో గుర్తు తెలి యని యువకుడు (25) హత్యకు గురైనట్టు ఆదివారం ఉదయం స్థాని కులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరి శీలించారు.

ఎవరో అతడి తలపై బండరాయితో మోది చంపినట్టు గుర్తించారు. హతుడు ఎవరు? పార్కులో ఎందుకు నిద్రపోతున్నాడు, ఎవరు హత్య చేశారు అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోడ్డులో జులాయిలు, చిత్తుకాగితాలు ఎరుకొనేవారు ఎక్కువగా తిరుగుతుంటారని, వారిలో ఎవరైనా ఈ దారుణానికి ఒడిగట్టారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.  మృతుడి షర్టు కాలర్‌పై నేషనల్ 20 అనే టైలర్ సిక్టర్ ఉంది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి సంబంధీకులుంటే నేరుగా గాంధీనగర్ పోలీసుస్టేషన్‌లో, లేదా ఫోన్ నెం. 040-2785 3585, ఇన్‌స్పెక్టర్ సంజీవరావు (94906 16335)ను సంప్రదించవచ్చు.  ఈ హత్యకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తమకు తెలియజేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఐ హామీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement