‘మున్సిపాలిటీ’ ఓటర్ల తుది జాబితా ప్రకటన

Municipal Elections In Telangana On January 22 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. 22న జరగనున్న 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల పరిధిలో 53,36,605 ఓటర్లున్నట్టు తేలింది. పురుషులు 26,71,694, మహిళలు 26,64, 557, ఇతరులు 354 మంది ఉన్నారు. ఇటీవ ల 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల వా రీగా ముసాయిదా జాబితాను ప్రకటించగా, శనివారం ఒక్కో జిల్లా పరిధిలో ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓ టర్ల తుది జాబితాను ప్రకటించారు.

అయితే మున్సిపాలిటీల్లో ఓటర్ల తుది జాబితాలను ఆ దివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనుమతి తో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నెల 30న ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబి తా ప్రకారం... ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మొత్తం ఓటర్లు 53,57,260 ఉండగా, వారిలో పురుషులు 26,72,021 మంది, మహిళలు 26,64,885 మంది, ఇతరులు 354 ఉన్నట్టు ప్రకటించా రు. శనివారం అనధికారికంగా వెల్లడించిన వి వరాల ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 655 మేర తగ్గినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే తుది జాబితాలో మహిళా ఓటర్ల కంటే పురుషుల ఓట్లు 7,137 అధికంగా ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top