ఫాంహౌస్‌లో ముంబై యువతులు | Mumbai girls caught in farm house | Sakshi
Sakshi News home page

ఫాంహౌస్‌లో ముంబై యువతులు

Apr 14 2015 10:00 PM | Updated on Mar 28 2018 11:08 AM

ఫాంహౌస్‌లో ముంబై యువతులు - Sakshi

ఫాంహౌస్‌లో ముంబై యువతులు

మహేశ్వరం పోలీసులు మంగళవారం ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి ముంబైకి చెందిన యువతులను, హైదరాబాద్కు చెందిన యువకులను అరెస్ట్ చేశారు.

రంగారెడ్డి(మహేశ్వరం): మహేశ్వరం పోలీసులు మంగళవారం ఓ ఫాంహౌస్‌పై దాడి చేసి ముంబైకి చెందిన యువతులను, హైదరాబాద్కు చెందిన యువకులను అరెస్ట్ చేశారు.  మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామ శివారు ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు అక్కడకు వెళ్లారు. అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నవారిని అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అయినవారిలో ఇద్దరు ముంబై యువతులు, ఏడుగురు హైదరాబాద్‌కు చెందిన యువకులు ఉన్నారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు  ఈ ఫాంహౌస్పై దాడి చేసినట్లు పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement