సాక్షి, భూపాలపల్లి : ములుగు నియోజకవర్గ మొదటి ఎమ్మెల్యే సూర్యనేని రాజేశ్వర్ రావు మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు (ఆదివారం) కన్నుమూశారు. ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) పార్టీ తరఫున ములుగు మొట్ట మొదటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1957 నుంచి 62 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే రాజేశ్వర్ రావు స్వస్థలం వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవి పేట గ్రామం.