జేపీ దర్గాలో ఎంపీ పొంగులేటి ప్రార్థనలు | MP ponguleti prayers in JP dargah | Sakshi
Sakshi News home page

జేపీ దర్గాలో ఎంపీ పొంగులేటి ప్రార్థనలు

Jan 17 2015 12:50 AM | Updated on May 25 2018 9:17 PM

జేపీ దర్గాలో ఎంపీ పొంగులేటి ప్రార్థనలు - Sakshi

జేపీ దర్గాలో ఎంపీ పొంగులేటి ప్రార్థనలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్ పీర్ (జేపీ) దర్గాను సందర్శించారు.

కొత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్ పీర్ (జేపీ) దర్గాను సందర్శించారు. దర్గాలో బాబాకు చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం కొనసాగించాలని, ప్రజలంతా క్షేమంగా ఉండేలా చూడాలని ప్రార్థించినట్లు చెప్పారు.

ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, రైతుసంఘం అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి, పార్టీ నాయకులు నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, బీష్వ రవీందర్, ముంతాజ్ అహ్మద్, బంగి లక్ష్మణ్, బొబ్బిలి సుధాకర్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, జెట్టి రాజశేఖర్, వరదారెడ్డి, హైదర్‌అలీ, నసీర్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement