తెలంగాణ సాధనలో అమరులైనవారి త్యాగాలను గుర్తుచేసుకొని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కంటతడి పెట్టారు.
తెలంగాణ సాధనలో అమరులైనవారి త్యాగాలను గుర్తుచేసుకొని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కంటతడి పెట్టారు. మంగళవారం కామారెడ్డిలో అమరవీరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. అయిన వారిని కోల్పోయిన కుటుంబాలతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
30 మంది అమరవీరుల కుటుబాలకు చెక్కుల రూపంలో సుమారు రూ.3.10 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జరింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎంపీ పాటిల్, ప్రభుత్వ విఫ్ గంప గోవర్ధన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.