'అటెండర్ ఉద్యోగం కూడా భర్తీచేయకపోవడం సిగ్గుచేటు' | mlc ramchandra rao takes on trs sarkar | Sakshi
Sakshi News home page

'అటెండర్ ఉద్యోగం కూడా భర్తీచేయకపోవడం సిగ్గుచేటు'

Jul 12 2015 9:14 PM | Updated on Oct 16 2018 3:12 PM

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్ష ఉద్యోగాలిస్తామన్న కేసీఆర్ ఏడాది పాలనలో కనీసం అటెండర్ ఉద్యోగం కూడా భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు విమర్శించారు.

మెదక్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్ష ఉద్యోగాలిస్తామన్న కేసీఆర్ ఏడాది పాలనలో కనీసం అటెండర్ ఉద్యోగం కూడా భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు విమర్శించారు. టీఆర్‌ఎస్ సర్కార్ నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు. ఆదివారం మెదక్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు.

 

తెలంగాణ ఉద్యమంలో యువకులు, విద్యార్థులే కీలకపాత్ర పోషించారన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య ఉత్తిమాటగా మారిందని విమర్శించారు. తెలంగాణలోని 11విశ్వవిద్యాలయాలకు వైస్‌చాన్సలర్లు లేకుండా పోయారన్నారు. హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement