నా తప్పుంటే చర్యలు తీసుకోవచ్చు: ఎమ్మెల్యే

MLA Muthireddy Yadagiri Reddy Gives Clarity On Land Kabza - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జనగాం జిల్లాలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేనల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై ఇరువురి మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. బతుకమ్మ కుంట విషయంలో  తన తప్పు ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చునని ఆయన చెప్పారు. ఈ అంశంపై మంగళవారం సచివాలయంలో సీఎస్‌ ఎస్పీ సింగ్‌ను ముత్తిరెడ్డి కలిసి అక్కడి పరిస్థితులపై నివేదిక ఇచ్చారు.

అనంతరం సచివాలయం మీడియా పాయింట్‌  మాట్లాడుతూ... బతుకమ్మ కుంట కబ్జాకు గురికాకుండా ఉండాలనే గోడ కట్టామన్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి కమిటీ వేయలేదన్నారు. జనగామ చెరువు సుందరీకరణకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందన్నారు. అఖిల పక్షం కమిటీ సూచన మేరకే స్థానికుల సౌకర్యం కోసం చెరువు అభివృద్ధి చేశామన్నారు. కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని, కలెక్టర్ ప్రభుత్వాన్ని బదునాం చేస్తున్నారని తెలిపారు. అనుభవంలేని కలెక్టర్‌ వల్లే ఈ సమస్య అని, పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని, ప్రభుత్వ ఆలోచనలకు విరుద్ధంగా కలెక్టర్‌ పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎందుకు కలెక్టర్‌పై చర్యలు తీసుకోవడంలేదని విలేకరుల ప్రశ్నించగా, అందుకు తగిన సమయం రావాలన్నారు. ఇప్పటికే ఈ అంశంపై సీఎస్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top