సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారులపై నిరాధార ఆరోపణలను తెలంగాణ ఐఏఎస్ అసోసియేషన్ ఖండించింది. ఐఏఎస్ అధికారిణి దేవసేనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన అసోసియేషన్.. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ (FATHI) చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ఐఏఎస్ అసోసియేషన్ పేర్కొంది. అధికారులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం తగదు. సివిల్ సర్వెంట్ల ప్రతిష్ట దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యాఖ్యలు ఉన్నాయి’’ అంటూ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘నిరాధార ఆరోపణలు ప్రజలలో విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. సంక్షోభాల్లో, ఒత్తిళ్లలోనూ నిజాయితీగా ఐఏఎస్ అధికారులు అధికారులు పనిచేస్తున్నారు. అవినీతి ఆరోపణలు.. అధికారి మోరాల్‌ను దెబ్బతీస్తాయి. తక్షణమే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అధికారుల అసోసియేషన్ హెచ్చరించింది.


