రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే పీఏ దంపతుల మృతి  | MLA Bajireddy Govardhan PA And His Wife Died In Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే పీఏ దంపతుల మృతి 

Apr 6 2018 2:55 AM | Updated on Oct 17 2018 6:10 PM

MLA Bajireddy Govardhan PA And His Wife Died In Road Accident - Sakshi

సాక్షి, గజ్వేల్‌ (రూరల్‌) : ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న సంఘటనలో భార్యాభర్తలు మృతి చెందారు. గురువారం సాయంత్రం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌ ఆర్టీసీడిపో సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గజ్వేల్‌ సీఐ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన బాల గంగాధర్‌(55) నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి పీఏగా పనిచేస్తున్నారు. ఆయన తన భార్య విజయ(48)తో కలసి గురువారం ఉదయం కారులో వేములవాడకు దైవదర్శనానికి వెళ్లారు.

అనంతరం సాయంత్రం వేములవాడ నుంచి తిరిగి వస్తుండగా ప్రజ్ఞాపూర్‌ ఆర్టీసీడిపో వద్దకు రాగానే ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బాల గంగాధర్, విజయ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న గజ్వేల్‌ సీఐ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్రేన్‌ సహాయంతో లారీ కింద నుంచి కారును తొలగించి మృతదేహాలను గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement