
‘కులవృత్తుల అభివృద్ధే సీఎం లక్ష్యం’
రాష్ట్రంలోకులవృత్తులకు ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలోకులవృత్తులకు ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉప్పర, సగర కుల నేతలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని కులాలను అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని తెలిపారు
దానికోసమే ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం భవన నిర్మాణాల్లో ఎస్సీ, ఎస్టీ, వడ్డెరలతో సమానంగా తమకు కూడా 15 శాతం రిజర్వేషన్లు కల్పించడం పట్ల సగర, ఉప్పర కులస్తులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.