వడదెబ్బతో ఉపాధి కూలీ మీనుగు చంద్రయ్య (45) మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా వెంకటాపురం మండలంలోని బుర్గుపేట గ్రామంలో సోమవారం జరిగింది.
వరంగల్ : వడదెబ్బతో ఉపాధి కూలీ మీనుగు చంద్రయ్య (45) మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా వెంకటాపురం మండలంలోని బుర్గుపేట గ్రామంలో సోమవారం జరిగింది. బుర్గుపేటకు చెందిన చంద్రయ్య ఉపాధి హామీ పథకంలో భాగంగా అందుగులమీది సమీపంలో రోడ్డు పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి ఆస్వస్థతకు లోనయ్యాడు. దీంతో స్థానిక కూలీలు చంద్రయ్యను ఇంటికి తీసుకురాగా... వాంతులు, విరోచనాలు ఎక్కువై ఇంటివద్దనే మృతిచెందాడు. ఉపాధి పనులు చేసే సంఘటన స్థలంలో కనీస సౌకర్యాలు లేనందున చంద్రయ్య మృతిచెందాడని ఉపాధీ కూలీలు ఆరోపిస్తున్నారు.
(వెంకటాపురం)