పోలీసుల అదుపులో దళ సభ్యుడు | maoist arrested in khammam distirict | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో దళ సభ్యుడు

Apr 2 2015 11:06 AM | Updated on Sep 2 2017 11:45 PM

పోలీసుల అదుపులో దళ సభ్యుడు

పోలీసుల అదుపులో దళ సభ్యుడు

ఖమ్మం జిల్లా భట్టిగూడెం అడవి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.

ఖమ్మం :  ఖమ్మం జిల్లా భట్టిగూడెం అడవి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నసమయంలో అతన్ని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో తన పేరు మాడవి నందు అలియాస్ రమేష్(26) అని, గత మూడు సంవత్సరాలుగా ఎల్‌ఓఎస్ దళంలో సభ్యుడిగా పనిచేసినట్లు తెలిపాడు. రమేష్ స్వస్థలం ఖమ్మం జిల్లా చెర్ల మండలం పెద్ద మడిసీలేరు గ్రామ పంచాయతీ పరిధిలోని భట్టిగూడెం. రమేష్‌ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏఎస్పీ ఆర్ భాస్కరన్ తెలిపారు.
 (చెర్ల)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement