కానిస్టేబుల్‌ ఉద్యోగం రాలేదని..

Man Commits Suicide At Vikarabad District - Sakshi

ఇద్దరు యువకుల బలవన్మరణం

వేర్వేరు ప్రాంతాల్లో ఘటనలు

యాలాల/బంట్వారం: పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో ఇద్దరు యువకులు వేర్వేరు చోట్ల బలవన్మరణాల కు పాల్పడ్డారు. ఈ వి షాదకర ఘటనలు వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం రాస్నం, అదే జిల్లాకు చెందిన బంట్వారంలో చోటుచేసుకున్నాయి. కుటుంబీకులు, పోలీసు ల కథనం ప్రకారం.. రాస్నం గ్రామానికి చెంది న దోమ మల్లేశం, పుష్పమ్మ దంపతుల కుమా రుడు రోహిత్‌ అలియాస్‌ రంజిత్‌ (24) బీటెక్‌ వరకు చదివాడు. 2018లో వెలువడిన నోటి ఫికేషన్‌తో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి సన్నద్ధమయ్యాడు. రెండు నెలల క్రితం ఈ ఫలితాలు వె లువడ్డాయి. బీసీ–డీ కేటగిరీకి చెందిన రంజిత్‌ కు 101 మార్కులు వచ్చాయి. కటాఫ్‌ 103 మార్కులు కావడంతో రెండు మార్కుల తేడా తో ఉద్యోగం కోల్పోయాడు. దీనిపై తరచూ స్నేహితులు, బంధువుల వద్ద చెబుతూ మనోవేదనకు గురవుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అతడు ఇంట్లో పైకప్పుకు తాడుతో ఉరేసుకున్నాడు. సోమవారం ఉద యం కుటుంబీకులు గమనించగా అప్పటికే విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. మృతుడి సోదరుడు రాకేష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఉరివేసుకొని ఆత్మహత్య.. 
పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం చేజారిందనే మనస్తాపంతో వికారాబాద్‌ జిల్లా బంట్వారం లో కుమార్‌ (24) అనే యువకుడు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన అల్లిపురం నర్సింలు, ఈశ్వరమ్మ దంపతుల నాలుగో కొడుకు కుమార్‌ డిగ్రీ వరకు చదివాడు. కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో హైదరాబాద్, తాండూ రులో శిక్షణ తీసుకున్నా డు. ఇటీవల విడుదలై న ఫలితాల్లో అతడికి ఉద్యోగం రాలేదు. అ దే గ్రామానికి చెందిన కుమార్‌ స్నేహితులకు ఇద్దరికి ఉద్యోగం వ చ్చింది. తనకు ఉద్యో గం రాలేదని అతడు మిత్రులకు చెప్పి ఆవేద న వ్యక్తం చేస్తుండేవాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కుమార్‌ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎదిగి వచ్చిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడటంతో నర్సింలు దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top