
జాతీయ రహదారిపై దగ్ధమవుతున్న కారు
గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద మరో దుర్ఘటన జరిగింది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందిన ప్రాంతానికి సమీపంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఓ ఆల్టో కారు దగ్ధం కావడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. సమాచారం తెలుసుకున్న గజ్వేల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. కారులో సజీవ దహనమైన మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.