మహాకూటమి ఓ నినాదం మాత్రమే.. 

Mahakutami Is Only A Slogan - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: మహాకూటమి అనేది పేరు, నినా దం మాత్రమేనని, దేశంలో ఎక్కడ వ్యవహా రికంగా ఆ కూటమి లేదని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు విమర్శించారు. శుక్రవారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మురళీధర్‌రావు మాట్లాడారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం ప్రారంభమైందని, బీజేపీ, ఎన్‌డీఏ మోదీ నాయకత్వంలో ఎన్నికల ప్రచారంలో వేగం గా దూసుకెళ్తుందన్నారు. ఎన్‌డీఏలో మిత్రపక్షాలు తగ్గుముఖం పట్టాయని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, 2014 కంటే ఎన్‌డీఏ 2019 ఎన్నికల్లో బలంగా ముందుకెళ్తుందని తెలిపారు.

పార్టీ బలం, పార్టీల సంఖ్య కూడా ఎన్‌డీఏలో పెరిగిం దన్నారు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి బలమైన కూటమి మద్దతు ఉందన్నారు. దేశంలో ఎక్కడా ప్రతిపక్ష కాంగ్రెస్‌ తో కలిసి పనిచేసేందుకు ప్రాంతీయ పార్టీలు ముందుకు రావడం లేదన్నారు.  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యూపీఏకు సిద్ధాంతకర్తగా మా రారని ఆరోపించారు. కానీ రాహుల్‌ ప్రధాని కా వాలని కోరుకునే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు మాత్రం సాహ సించడం లేదన్నారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లకు ఒక్కటి కూడా తక్కువ రాదని ఆశాభావం వ్యక్తం చేశారు. నేటి నుంచి బీ జేపీ అభ్యర్థుల ప్రకటన అంచెల వారీగా ఉంటుందని, రాష్ట్ర శాఖ నేడు ఢిల్లీకి వెళ్లి అభ్యర్థుల ప్రతిపాదనను కమిటీ ముందు ఉంచనుందన్నారు.  

మూడు ప్రధాన అంశాలతో ప్రజల్లోకి.. 
రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ మూడు ప్రధాన అంశాలతో ప్రజల్లోకి వెళ్లనుందని మురళీధర్‌రావు ప్రకటించారు. ఐదేళ్లలో దేశంలో చేసిన అభివృద్ధి, బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి పథకాల అమలు, శత్రుదేశాలు, ఉగ్రవాదులు, సవాళ్లు, ఎదుర్కొనే సత్తా వంటి అంశాలను ప్రచారంలో ఉంచనున్నామన్నారు. దేశానికి స్థిర ప్రభుత్వం రావాలంటే మోదీకి ఓటేయ్యాలని ఇప్పటికే ప్రజలు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఈసమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యులు యెండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, బస్వా లక్ష్మీనర్సయ్య, నాయకులు వెంకటేష్, గజం ఎల్లప్ప, యెండల సుధాకర్, శ్రీనివాస్‌ శర్మ, మల్లేష్‌ యాదవ్, భరత్‌ భూషణ్, తదితరులు పాల్గొన్నారు.    
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top