breaking news
Murali Dhar Rao
-
మహాకూటమి ఓ నినాదం మాత్రమే..
సాక్షి, నిజామాబాద్: మహాకూటమి అనేది పేరు, నినా దం మాత్రమేనని, దేశంలో ఎక్కడ వ్యవహా రికంగా ఆ కూటమి లేదని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు విమర్శించారు. శుక్రవారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మురళీధర్‌రావు మాట్లాడారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం ప్రారంభమైందని, బీజేపీ, ఎన్డీఏ మోదీ నాయకత్వంలో ఎన్నికల ప్రచారంలో వేగం గా దూసుకెళ్తుందన్నారు. ఎన్డీఏలో మిత్రపక్షాలు తగ్గుముఖం పట్టాయని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, 2014 కంటే ఎన్డీఏ 2019 ఎన్నికల్లో బలంగా ముందుకెళ్తుందని తెలిపారు. పార్టీ బలం, పార్టీల సంఖ్య కూడా ఎన్డీఏలో పెరిగిం దన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి బలమైన కూటమి మద్దతు ఉందన్నారు. దేశంలో ఎక్కడా ప్రతిపక్ష కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు ప్రాంతీయ పార్టీలు ముందుకు రావడం లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యూపీఏకు సిద్ధాంతకర్తగా మా రారని ఆరోపించారు. కానీ రాహుల్ ప్రధాని కా వాలని కోరుకునే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు మాత్రం సాహ సించడం లేదన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లకు ఒక్కటి కూడా తక్కువ రాదని ఆశాభావం వ్యక్తం చేశారు. నేటి నుంచి బీ జేపీ అభ్యర్థుల ప్రకటన అంచెల వారీగా ఉంటుందని, రాష్ట్ర శాఖ నేడు ఢిల్లీకి వెళ్లి అభ్యర్థుల ప్రతిపాదనను కమిటీ ముందు ఉంచనుందన్నారు. మూడు ప్రధాన అంశాలతో ప్రజల్లోకి.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మూడు ప్రధాన అంశాలతో ప్రజల్లోకి వెళ్లనుందని మురళీధర్‌రావు ప్రకటించారు. ఐదేళ్లలో దేశంలో చేసిన అభివృద్ధి, బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి పథకాల అమలు, శత్రుదేశాలు, ఉగ్రవాదులు, సవాళ్లు, ఎదుర్కొనే సత్తా వంటి అంశాలను ప్రచారంలో ఉంచనున్నామన్నారు. దేశానికి స్థిర ప్రభుత్వం రావాలంటే మోదీకి ఓటేయ్యాలని ఇప్పటికే ప్రజలు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఈసమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యులు యెండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, బస్వా లక్ష్మీనర్సయ్య, నాయకులు వెంకటేష్, గజం ఎల్లప్ప, యెండల సుధాకర్, శ్రీనివాస్ శర్మ, మల్లేష్ యాదవ్, భరత్ భూషణ్, తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్తో పొత్తుండదు
బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తో సహా ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని బీజేపీ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో టీఆర్ఎస్ హనీమూన్ ముగిసింది. ప్రజల పక్షాన పోరాటాలను ఇకపై రుచిచూడాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, టీఆర్ఎస్ వైఫల్యాలు, వాటిపై పోరాటాల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది. ఈ రెండేళ్లలో సత్తా చూపిస్తే భవిష్యత్ ఎన్నికల్లో అధికారం కష్టమేమీ కాదు. పార్టీ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఇక నుంచి ప్రతీ నెల అమిత్‌షా రాష్ట్రానికి వస్తారు. బీజేపీ తడాఖా ఏమిటో టీఆర్ఎస్ చూస్తుంది’ అని మురళీధర్‌రావు హెచ్చరించారు. పోరాటాలు చేయడానికి వేచిచూడాల్సిన అవసరం లేదని, తాత్సారం చేస్తే టీఆర్ఎస్పై వస్తున్న వ్యతిరేకతను కాంగ్రెస్ అందిపుచ్చుకునే అవకాశముందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే అధికారం సంపాదిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్తో ఒకసారి యుద్ధం మొదలైతే అన్నీ సర్దుకుంటాయని మురళీధర్‌రావు చెప్పారు. ప్రజల్లో ఇప్పుడిప్పుడే అసంతృప్తి మొదలైందని, అసలు పోరాటం ఇప్పుడే ఆరంభం అవుతుందన్నారు. రాష్ట్రంలో టీడీపీ లేదనే భావనతోనే పనిచేస్తామన్నారు.