
దీంతో 10% ట్రాఫిక్ పెరి గినా ఎక్కడా రద్దీ కనిపించలేదు. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 22న జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో మూతపడిన ఐటీ కారి డార్‌లోని కంపెనీలు 51 రోజుల తర్వాత తెరుచుకున్నాయి. మాదాపూర్, కొండాపూర్, గచ్చి బౌలి, నానక్‌రాంగూడ ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం నాలెడ్జి సిటీ తదితర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు సోమవారం తెరిచారు. దీంతో 10% ట్రాఫిక్ పెరి గినా ఎక్కడా రద్దీ కనిపించలేదు. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 22న జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఐటీ కంపెనీలకు మార్చి 20 చివరి వర్కింగ్ డే కాగా మార్చి 21 వీకెండ్ సెలవు వచ్చింది.
జనతా కర్ఫ్యూ అనంతరం లాక్‌డౌన్ విధిం చడంతో ఐటీ కంపెనీలు మూసివేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్‌కు అవకాశం కల్పించారు. కోవిడ్–19 జాగ్రత్తలు పాటిస్తూ, శానిటైజేషన్ చేస్తూ, భౌతిక దూరం పాటిస్తూ 33% మంది ఐటీ ఉద్యోగులు పని చేయవచ్చని ప్రభుత్వం తాజాగా ఆదేశాలివ్వడంతో కంపెనీలు తెరిచారు. సోమవారం అత్యవసర విభాగాల్లో పని చేసే కొందరు ఐటీ ఉద్యోగులు సొంత వాహనాలు, కంపెనీ బస్సుల్లో విధులకు వచ్చారు. దీంతో ప్రధాన కూడళ్లలోనూ ట్రాఫిక్ రద్దీ పెద్దగా కనిపించలేదు. కంపెనీలో 33% ఉద్యోగులు హాజరయ్యేందుకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.