రైతుకు ఊరట | Loans to famers | Sakshi
Sakshi News home page

రైతుకు ఊరట

Jul 11 2014 1:09 AM | Updated on Aug 20 2018 9:16 PM

తెలంగాణలో రూ.200 కోట్లతో ఉద్యాన(హార్టికల్చర్) విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

జగిత్యాల అగ్రికల్చర్ : తెలంగాణలో రూ.200 కోట్లతో ఉద్యాన(హార్టికల్చర్) విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలోని ఉద్యానవన పంటలను ఎక్కువగా కరీంనగర్ జిల్లాలోనే సాగు చేస్తారు. దాదాపు 1.75 లక్షల ఎకరాల్లో మామిడి, పసుపు, మిరప, అరటి, బొప్పాయి, వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. ఇందులో 80 వేల ఎకరాల్లో మామిడితోటల పెంపకం చేపడుతున్నారు. జగిత్యాల మామిడి మార్కెట్ ద్వారా ఏటా సుమారు రూ.300 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. దీంతో ఉద్యాన విశ్వవిద్యాలయం జిల్లాలోనే ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
 
కౌలు రైతులకు రుణాలు
భూమిలేని రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో కౌలురైతులు వడ్డీవ్యాపారులను ఆశ్రయించి దోపిడీకి గురవుతున్నారు. వారిని ఆదుకునేందుకు నాబార్డు ద్వారా కౌలురైతులందరికీ రుణాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. జిల్లాలో సుమారు 60వేల మంది కౌలు రైతులు ఉండగా, వీరిలే కేవలం 9,413 మందికే రుణ అర్హత కార్డులున్నాయి. అరుునా 90 శాతం మంది రైతులకు రుణాలు అందడంలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో కౌలురైతులకు రుణం లభించే అవకాశముంది. మిగతా రైతులకు సైతం ఎక్కువ స్థాయిలో రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. బ్యాంకుల ద్వారా దాదాపు రూ.8 లక్షల కోట్ల రుణాలు అందివ్వాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. స్వల్పకాలంలో తీసుకున్న పంట రుణాలను చెల్లిస్తే వడ్డీలో మూడు శాతం రాయితీ ఇస్తామని చెప్పడం రైతులకు కలిసివచ్చే అంశం.

పంటలకు ధరల స్థిరీకరణ నిధి
 పంట ఉత్పత్తులు చేతికి వచ్చిన తర్వాత ధరలు పతనం కావడంతో రైతులకు పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందడంలేదు. ఈ నేపథ్యంలో రూ రూ.500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటును బడ్జెట్‌లో ప్రకటించారు. ధరలు పతనమైన ప్పుడు ఈ నిధితో రైతులను ఆదుకునే అవకాశముంటుంది. ఫలితంగా జిల్లాలో మొక్కజొన్న, పత్తి, పసుపు, జొన్న, సజ్జ, సోయాబీన్, వరి వంటి పంటలు పండించే రైతులకు లాభం చేకూరనుందని రైతు ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయానికి ‘ఉపాధి’ లింకు
వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని కేంద్రం నిర్ణయించింది. జిల్లాలో 3.13 లక్షల చిన్న, సన్నకారు రైతులుండగా.. వ్యవసాయ పనుల్లో వీరికి కూలీలు దొరకక ఇబ్బందులు పడతున్నారు. జిల్లాలో ఆరు లక్షలకు పైగా ఉపాధిహామీ జాబ్‌కార్డులు ఉన్నారుు. ఈ కార్మికులను వ్యవసాయం వైపు మళ్లిస్తే మరింత చేయూతనిచ్చిట్టు అవుతుంది.

రైతుల్లో చైతన్యం కోసం కిసాన్ టీవీ
వ్యవసాయం, వ్యవసాయూధారిత కార్యక్రమాలు, నీటి పరిరక్షణ, ఎరువుల వినియోగంపై ఎప్పటికప్పుడు రైతుల్లో చైతన్యం నింపేందుకు రూ.100 కోట్లతో కిసాన్ టీవీని ఏర్పాటు చేయనున్నట్టు బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశంలోని అన్ని భాషల్లో కిసాన్ టీవీ ప్రసారాలు ఉంటారుు. విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చేవరకు రైతు చైతన్య కార్యక్రమాలు కొనసాగుతారు.

ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పరిశోధనలు
ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ భాగస్వామ్యంతో వ్యవసాయ పరిశోధనలను మెరుగైన పరిశోధనలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పుణేలో జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఉండగా... తాజాగా అస్సోం, జార్ఖండ్‌లో ఏర్పాటు చేసేందుకు బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటారుుంచారు. దీంతో జిల్లాలోని పొలాస వ్యవ సాయ పరిశోధన స్థానానికీ సహాయ సహకారాలు అందే అవకాశముంది. దీంతోపాటు రూ.56 కోట్లతో భూసార పరీక్ష కేంద్రాలు, రూ.100 కోట్లతో భూనాణ్యత కార్డులు, భూమి లేని 5లక్షల మంది రైతులకు ఆర్థికసాయం, నగరాల్లో రైతు మార్కెట్ల ఏర్పాటు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఖర్చు చేసేందుకు రూ.100 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement