తెలంగాణలో మందుబాబులకు శుభవార్త

Liquor Shops Open Till 10 Pm  In Telangana - Sakshi

మరో రెండు గంటల పాటు మద్యం అమ్మకాలకు అనుమతి

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పింది. అదనంగా మరో 2 గంటల పాటు మద్యం అమ్మకాలకు అనుమతిస్తున్నట్టు తెలిపింది. వివరాల్లోకి వెళితే.. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇటీవల తెలంగాణలో మద్యం షాపులు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే మాత్రమే మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా ఆంక్షల కారణంగా ఇప్పటివరకు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పరిమితమైన మద్యం దుకాణాలను రాత్రి ఎనిమిది వరకు తెరిచేందుకు ఎక్సైజ్‌ శాఖ అనుమతినిచ్చింది. ఈ మేరకు జీవో ఎంఎస్‌ నం 72 ప్రకారం కంటైన్మెంట్‌ జోన్లలో మినహా మిగిలిన ప్రాంతాల్లోని మద్యం దుకాణాల్లో విక్రయాలు జరపొచ్చని ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.  (చదవండి : రాకపోకలకు గ్రీన్‌ సిగ్నల్‌)

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు కూడా రాత్రి 8 గంటల వరకు కొనసాగించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో రాత్రి 8 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంచనున్నారు. దీంతో అదనంగా మరో 2 గంటల పాటు మద్యం కొనుగోలుకు అవకాశం లభించడంతో.. మందుబాబులు సంబరపడుతున్నారు. ఈ నిర్ణయంతో మద్యం కొనుగోళ్లు కొద్దిమేర పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణలో ఆస్పత్రులు, మందుల దుకాణాలు మినహా.. అన్ని దుకాణాలు, వ్యాపార సదుపాయాలు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top