పాలమూరులో ఐటీపార్క్‌.. గద్వాల్‌లో హ్యాండ్లూమ్‌ ప్లాంట్‌ | KTR Speech On T-Hub Incubator's Success in telangana assembly | Sakshi
Sakshi News home page

పాలమూరులో ఐటీపార్క్‌.. గద్వాల్‌లో హ్యాండ్లూమ్‌ ప్లాంట్‌

Nov 9 2017 2:16 PM | Updated on Aug 11 2018 6:42 PM

KTR Speech On T-Hub Incubator's Success in telangana assembly - Sakshi

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ హబ్‌ సత్ఫలితాలను ఇస్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ హబ్‌ సత్ఫలితాలను ఇస్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. 25 కార్పోరేట్ సంస్థలతో టీహబ్ భాగస్వామ్యం ఏర్పర్చుకుంది. ఐటీ పరిశ్రమల్లో పనిచేస్తున్న మహిళలకు ప్రత్యేక భద్రత కల్పిస్తుందని అన్నారు. మహబూబ్‌నగర్‌లో త్వరలో ఐటీపార్క్ ఏర్పాటు చేస్తామని.. టీహబ్ -2 ప్రపంచంలో అతిపెద్ద స్టార్టప్ కేంద్రంగా మారనుందని ఆయన తెలిపారు. 

అదేవిధంగా చేనేత కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.1,270 కోట్లు కేటాయించామని కేటీఆర్ వెల్లడించారు. చేనేత రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తుందని. గద్వాలలో త్వరలో హ్యాండ్లూమ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement