ఆర్టీసీ టీఎంయూ రాష్ట్ర కార్యదర్శిగా కొండయ్య | kondaiah nominated to rtc tmu secretary | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ టీఎంయూ రాష్ట్ర కార్యదర్శిగా కొండయ్య

Published Thu, Aug 6 2015 4:33 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బి.కొండయ్యను నియమిస్తూ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వర్థామ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

మహబూబ్‌నగర్ అర్బన్: ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బి.కొండయ్యను నియమిస్తూ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వర్థామ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా మహబూబ్‌నగర్ రీజియన్ కమిటీ సభ్యులను నియమించారు. చైర్మన్‌గా డబ్ల్యూకే బసప్ప, ఉపాధ్యక్షులుగా టీఎస్‌ఎస్ రెడ్డి, ఎం.రామకృష్ణ, సంయుక్త కార్యదర్శిగా దమ్మాయపల్లి శ్రీనివాసులు, కార్య నిర్వాహక కార్యదర్శులుగా కేఎస్ శివప్రసాద్, జి.ఆంజనేయులు, ఆర్‌ఎస్ రెడ్డి, ప్రచార కార్యదర్శిగా భానుప్రకాశ్ రెడ్డిని ఎంపిక చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement