మునుగోడును అభివృద్ధి చేస్తా: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Komatireddy Rajagopal Reddy Campaign In Munugodu - Sakshi

సాక్షి, సంస్థాన్‌ నారాయణపురం : మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్‌ నుంచి ప్రారంభమైన భారీ బైక్‌ ర్యాలీ, రోడ్‌షో మండలంలోని గుడిమల్కాపురం, సంస్థాన్‌ నారాయణపురం, పుట్టపాక గ్రామాల మీదుగా మునుగోడు మండలం వరకు సాగింది. అంతకు ముందు స్థానిక ప్రాచీన శివాలయంలో రాజగోపాల్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడు అభివృద్ధిని 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తానన్నారు. మునుగోడు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట పీఏసీఎస్‌ చైర్మన్‌ గడ్డం మురళీ«ధర్‌రెడ్డి, నయీంషరీఫ్, కె.లింగయ్య, బుజ్జి, వెలిజాల రామచంద్రం, ఏపూర్‌ సతీష్, మందుగుల బాలకృష్ణ, బచ్చనగోని గాలయ్య, కుందారపు యాదయ్య, శంకర్, శంకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, గడ్డం యాదయ్య, వంగూరు సత్తయ్య, యాదయ్య, రఘు, వెంకన్న తదితరులున్నారు.
సర్వేల్‌లో ఉద్రిక్తత.. 
సర్వేల్‌ గ్రామంలో రాజగోపాల్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తల ర్యాలీ అక్కడికి చేరుకుంది. ప్రజాకూటమి, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎదురెదురు పడ్డారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎస్‌ఐ మల్లీశ్వరి, తన సిబ్బందితో జోక్యం చేసుకొని ర్యాలీని అక్కడి నుంచి పంపించారు. గుజ్జలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతుండగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎంపీగా నువ్వు ఏం అభివృద్ధి చేశావు అంటూ రాజగోపాల్‌రెడ్డిని ప్రశ్నించారు. దీంతో కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రికంగా మారుతుండటంతో పోలీస్‌లు జోక్యం చేసుకొని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించడంతో ఉద్రికత్త సద్దుమణింది. అనంతరం రాజగోపాల్‌రెడ్డి ప్రచారం కొనసాగింది. 

మరిన్ని వార్తాలు...

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top