నల్లకుంటలో చిన్నారి అపహరణ | kid missing in nallakunta | Sakshi
Sakshi News home page

నల్లకుంటలో చిన్నారి అపహరణ

Mar 6 2015 10:10 PM | Updated on Sep 4 2018 5:16 PM

వీధిలో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులకు మాయమాటలు చెప్పిన ఓ గుర్తు తెలియని మహిళ వారిని అపహరించింది.

హైదరాబాద్: వీధిలో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులకు మాయమాటలు చెప్పిన ఓ గుర్తు తెలియని మహిళ వారిని అపహరించింది. అయితే మార్గ మద్యంలో ఇద్దరు చిన్నారులను వదిలేసినప్పటికీ ఓ చిన్నారిని మాత్రం తన వెంట తీసుకెళ్లింది. ఈ సంఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు... న్యూ నల్లకుంటకు చెందిన నారాయణ, మంజుల దంపతుల పిల్లలు నవీన్(9), మమత (5) మరో చిన్నారి అంకిత(9)తో కలిసి ఆడుకుంటుండగా ఓ గుర్తు తెలియని మహిళ వారికి మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకుని వెళ్లింది.

 

ఆటో తార్నాక చేరిన తర్వాత ఇద్దర్ని వదిలివేసి  మమత అనే చిన్నారిని తీసుకుని పరారయ్యంది. చిన్నారి అపహరణ గురించి మిగతా ఇద్దరు ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో తండ్రి వారిని ఇంటికి తీసుకోచ్చాడు. అయితే బాలుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement