కిక్‌బాక్సింగ్ జాతీయ క్రీడాకారుడి ఆత్మహత్య | kick boxing national player suicide | Sakshi
Sakshi News home page

కిక్‌బాక్సింగ్ జాతీయ క్రీడాకారుడి ఆత్మహత్య

Aug 10 2015 8:37 PM | Updated on Nov 6 2018 7:56 PM

జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ క్రీడాకారుడు.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రాంచంద్రపల్లికి చెందిన కుమ్మరి దిలీప్ (17) బలవన్మరణానికి పాల్పడ్డాడు.

మాక్లూర్: జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ క్రీడాకారుడు.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రాంచంద్రపల్లికి చెందిన కుమ్మరి దిలీప్ (17) బలవన్మరణానికి పాల్పడ్డాడు.  ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఈ నెల 8న దిలీప్ తల్లిదండ్రులు కల్లెడి గ్రామంలో తమ బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లారు. తెల్లవారుజామున ఇంటికి వచ్చిన వారు ఇంటి తలుపు తీసేసరికి దిలీప్ ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. సోమవారం అతడి అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్యంతో మనస్తాపానికి గురై దిలీప్ ప్రాణాలు తీసుకున్నాడని బంధువులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement