సీఎం కాగానే మాట మార్చిన కేసీఆర్ | KCR they have changed the word | Sakshi
Sakshi News home page

సీఎం కాగానే మాట మార్చిన కేసీఆర్

Jun 6 2014 2:29 AM | Updated on Aug 15 2018 9:20 PM

ఎన్నికల ప్రచారంలో రూ.లక్షలోపు పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తానన్న కేసీఆర్ సీఎంగా కాగానే మాటా మార్చారని అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య ఆరోపించారు.

ఖానాపూర్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రచారంలో రూ.లక్షలోపు పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తానన్న కేసీఆర్ సీఎంగా కాగానే మాటా మార్చారని అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో ఆందోళన చేపడతామని పేర్కొన్నారు. నాయకులు దేవన్న, సర్దార్, భూమేశ్వర్, అంకుశ్‌రావు, ఎల్లయ్య తదితరులున్నారు.
 
పంట రుణాలన్నింటినీ మాఫీ చేయాలి..
పంట రుణాలన్నింటినీ మాఫీ చేసి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలుపుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడారు. పట్టణ ఉపాధ్యక్షుడు షేక్ అజ్జర్, నాయకులు శ్రీపాద శేషాద్రి, కడపత్రి తిలక్‌రావు, బాశెట్టి నర్సింగ్‌రావు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement