'రెండు.. మూడు రోజులే ఉండి పోతుందిలే అనుకున్నా' | KCR review meeting on swine flu in hyderabad | Sakshi
Sakshi News home page

'రెండు.. మూడు రోజులే ఉండి పోతుందిలే అనుకున్నా'

Jan 21 2015 12:55 PM | Updated on Aug 15 2018 9:27 PM

'రెండు.. మూడు రోజులే ఉండి పోతుందిలే అనుకున్నా' - Sakshi

'రెండు.. మూడు రోజులే ఉండి పోతుందిలే అనుకున్నా'

రాష్ట్రాన్ని స్వైన్ ఫ్లూ పట్టి పీడిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వైన్ ఫ్లూపై యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

హైదరాబాద్ : రాష్ట్రాన్ని స్వైన్ ఫ్లూ పట్టి పీడిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వైన్ ఫ్లూపై యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బుధవారం సచివాలయంలో స్వైన్ ఫ్లూపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించాచారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... స్వైన్ ఫ్లూపై వార్తకథనాలు విరివిగా వుస్తుంటే .... స్వైన్ ఫ్లూ రెండు మూడు రోజులే ఉండి పోతుందిలే అనుకున్నా... కానీ పరిస్థితి వేరుగా ఉందన్నారు.

సైబీరియా చలిగాలులు మరో 20 రోజులు ఉండే అవకాశం ఉంది... దాంతో స్వైన్ ఫ్లూ మరింత విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో యుద్ధం ప్రకటించాల్సి ఉందని తెలిపారు. కేంద్ర సహకారంతో స్వైన్ ఫ్లూను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. ఈ రోజు సాయంత్రం 3 గం.లకు కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం 5.00 గంలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement