
మహబూబ్‌నగర్ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించాలని, మృతదేహాలను తరలించే విషయంలో చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాగానికి కేసీఆర్ తెలిపారు.
జిల్లాలోని అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డి పల్లి గ్రామం సమీపంలో జాతీయరహదారిపై మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో రెండు వాహనాలు ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.