ఎక్కని కొండలేదు.. మొక్కని బండ లేదు

Kavita Roadshow held in Jagathala distric in the election campaign - Sakshi

పసుపు రైతుల కోసం ఎంతో చేశా: కవిత

సాక్షి, జగిత్యాల: పసుపు రైతులకు న్యాయం కోసం తాను ఎక్కని కొండలేదని, మొక్కని బం డ లేదని సిట్టింగ్‌ ఎంపీ, నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. ఇరవై ఏళ్లలో వారి కోసం ఎవరూ చేయనంతగా తన శక్తి మేరకు కృషి చేశానని చెప్పారు. జగిత్యాల జిల్లాలోని సారంగపూర్‌ మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆమె రోడ్‌షో నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలో విలేకరులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతులు తన మీద పోటీ చేస్తే సమస్య పరిష్కారమవుతుందనుకుంటే తనకూ సంతోషమేనని వ్యాఖ్యానించారు.

రైతుల కోసం ఎవరూ చేయనంతగా తన శక్తి మేరకు కొట్లాడానని పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో జాతీయ స్థాయి పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తమకు 16 సీట్లు ఇచ్చి గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి పసుపు బోర్డును సాధిస్తామని హామీ ఇచ్చారు. దేశం గతి మా రాలి, దేశంలో మంచి మార్పు రావాలంటే టీఆర్‌ఎస్‌కు 16 ఎంపీ సీట్లు ఇచ్చి ఆశీర్వదించాలని కవిత కోరారు. 16 సీట్లను 116 చేసే సత్తా సీఎం కేసీఆర్‌కు ఉందన్నారు. ఆయనకు దేశంలో ఆ స్థాయి సంబంధాలు ఉన్నాయని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top