ఈ నెల 24న బహిరంగ కరాటే ప్రదర్శన | karate program on january 24 in hyderabad | Sakshi
Sakshi News home page

ఈ నెల 24న బహిరంగ కరాటే ప్రదర్శన

Jan 21 2015 7:34 PM | Updated on Sep 2 2017 8:02 PM

ఆడపిల్లలు ఆడపులులతో సమానం అనే విషయాన్ని లోకానికి చాటడానికి భారీ బహిరంగ కరాటే ప్రదర్శన ఏర్పాటు చేయడానికి బాలల హక్కులసంఘం ఏర్పాట్లు చేస్తోంది.

ఆడపిల్లలు ఆడపులులతో సమానం అనే విషయాన్ని లోకానికి చాటడానికి భారీ బహిరంగ కరాటే ప్రదర్శన ఏర్పాటు చేయడానికి బాలల హక్కులసంఘం ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 24న బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు బాలల హక్కుల సంఘం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో వేయి మంది బాలికలతో కరాటే ప్రదర్శన నిర్వహించనున్నట్లు బాలల హక్కుల సంఘం పేర్కొంది. ఈ కరాటే ప్రదర్శనకు పబ్లిక్ గార్డెన్స్ వేదిక కానుంది. ఆసక్తి ఉన్న పదమూడేళ్ల లోపు బాలికలు హాజరుకావచ్చని, ఎలాంటి ప్రవేశ రుసుం లేదని, ఇందులో పాల్గొన్న బాలికలకు సర్టిఫికెట్లు కూడా అందజేస్తామని బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్ అనురాధారావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement